సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ రెపో రేటు వడ్డింపు తరువాత భారీ అమ్మకాల ఒత్తిడితో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. చివరి అర్థ గంటలో కాస్త పుంజుకుని సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 54892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16356వద్ద స్థిరపడ్డాయి. అయితే కీలక మద్దతు స్థాయి 16400 పాయింట్ల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ మరింత బలహీన సంకేతాలిచ్చింది.
భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, రిలయన్స్, యూపీఎల్, ఏషియన్స్ పెయింట్స్ నష్టపోగా, ఎల్‌ఐసీ బుధవారం కూడా మరో 3 శాతం పతనమైంది. ఎస్‌బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, డా. రెడ్డీస్ లాభాల్లో ముగిసాయి.
అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపుతో పోలిస్తే 77.68 వద్ద ప్రారంభమైంది. చివరికి 77.73 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment