
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 311 పాయింట్లకు పైగా పెరిగి 59,272 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 17,573 వద్ద ట్రేడ్ అవుతోంది.మిశ్రమ ప్రపంచ సంకేతాలు, తగ్గుతున్న ముడి ధరలు విదేశీ పెట్టుబడుదారుల మద్దతు ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు మళ్లిస్తోంది.
ఎఫ్‌ఎంసిజి, రియల్టీ , బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా, ఫార్మా మెటల్ రంగ షేర్లు నష్టపోతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ , పవర్ గ్రిడ్, సిప్లా, లార్సెన్ బజాజ్ ఆటో లాబాల్లు ఉండగా, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 82.33 వద్ద ఫ్లాట్‌గా ఉంది.