
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆసియా మార్కెట్ల దన్నుతో ఆరంభంలో 350 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 255 పాయింట్ల లాభంతో 61176 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు ఎగిసి 18201 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల జోష్‌తో ఉన్నాయి.
బ్రిటానియా, ఎస్బీఐ అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటామోటార్స్, గ్రాసిం లాభాల్లోనూ, టైటన్, సిప్లా, డా. రెడ్డీస్, హిందాల్కో, ఏషియన్స్ పెయింట్స్ నష్టాల్లోనూ ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి పాజటివ్‌గా ఉంది 25 పైసల లాబంతో 82. 23 వద్ద కొనసాగుతోంది.
కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, పేటీఎం త్రైమాసిక ఫలితాలపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా రేపు(మంగళవారం) స్టాక్ మార్కెట్ పనిచేయదు. దీంతో ముగింపు లాభాల స్వీకరణ కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment