
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెప్పి లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే 250 పాయింట్లకుపైగా ఎగిసిన సూచీలు మధ్యలో కాస్త తడబడినా చివరికి భారీ లాభాల్లో స్థిరపడ్డాయి.సెన్సెక్స్ 479 పాయింట్ల లాభంతో 57625 వద్ద,నిఫ్టీ 140 పాయింట్లు ఎగిసి 171223 వద్ద క్లోజ్ అయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 57,600కి ఎగువన, నిఫ్టీ 17వేల 100 ఎగువన స్థిరంగా ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడాయి.
పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఆసియన్ పెయింట్స్, డా. రెడ్డీస్, భారతి ఎయిర్‌టెల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా కోలుకుంది. 82. 31 వద్ద మునుపటి ముగింపు 81.32తో పోలిస్తే ఫ్లాట్‌గా ముగిసింది.