
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మారర్కెఎట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 115 పాయింట్లు ఎగిసి 58413 వద్ద, నిప్టీ 26 పాయింట్లు లాభపడి 17408 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తద్వారా వరుసగా ఎనిమిదో సెషనల్‌లో లాభాలతో శుభారంభం చేశాయి. అయిల్ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గా ఉన్నాయి.
రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి 0.7 శాతం ఎగియగా, నిఫ్టీ ఎనర్జీ మాత్రం నష్ట పోతోంది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ లాంటి రేట్ సెన్సిటివ్ రంగాలు ఆర్బీఐ పాలసీ ఫలితాల నేపథ్యంలో 0.2 శాతం వరకు పెరిగాయి. ఎల్‌ఐసీ క్యూ1 ఫలితాల నేపథ్యంలో 2 శాతం ఎగిసింది. అలాగే క్యూ1లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.74.3 కోట్లకు పెరగడంతో బ్లూస్టార్ షేర్లు 3 శాతం పెరిగాయి.
ఇంకా గ్రాసిం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ డీ, అదానీ పోరర్ట్స్ తదితరాలు లాభపడుతుండగా, సెన్సెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ లూజర్‌గా ఉంది. ఇంకా సిప్లా, ఓఎన్జీసీ, రిలయన్స్, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకి నష్టపోతున్నాయి. మరోవైపు నేడు (శుక్రవారం) ఆర్బీఐ తన మానిటరీ పాలసీ విధానాన్ని ప్రకటించనుంది. రెపో రేటు పెంపునకు కేంద్ర బ్యాంకు మొగ్గు చూపవచ్చనేది పలు విశ్లేషకుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment