సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుసగా మూడు సెషన్ల నష్టాల తరువాత సూచీలు వారాంతంలో (శుక్రవారం) కోలుకున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు, ఏడాది కనిష్టానికి దిగొచ్చిన ద్రవ్యోల్బణం, ఇతర సానుకూల సంకేతాలతో ఆరంభంలో కాస్త తడబడినా తరువాత నష్టాల నుంచి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు లేదా 0.51శాతం పెరిగి 60,261, నిఫ్టీ 98 పాయింట్లు లేదా 0.55శాతం పెరిగి 17,957 వద్ద స్థిరపడ్డాయి. fe
ముఖ్యంగా ఫైనాన్షియల్, ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ క్యూ 3 త్రైమాసిక ఫలితాల్లో మెరుగ్గా ఉన్నాయి. దీంతో ఇన్ఫో షేర్లు బాగా లాభపడ్డాయి. ఇంకా అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, టాటా స్టీల్, బీపీసీఎల్ టాప్ విన్నర్స్‌గా, టైటన్, అపోలో హాస్పిటల్, ఎస్‌బీఐ లైఫ్,నెస్లే ఇండియా ,లార్సెన్ అండ్ టుబ్రో ఐటీసీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు డాలరు 21 పైసలు ఎగిసి 81.38 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment