
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసలాభాలతో కళకళలాడుతున్నాయి. నాలుగు వరుస సెషన్ల లాభాల పరుగుకు చెక్ పెడుతూ ఆరంభంలో వంద పాయింట్లకు పైగా కోల్పోయి సెన్సెక్స్ వెంటనే లాభాల్లోకి మళ్లింది. ప్రస్తుతం సెన్సెక్స్ 177 పాయింట్లు ఎగిసి 15574 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 16576 వద్ద కొనసాగుతున్నాయి.
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 55500 పాయింట్లను అధిగమించింది. అలాగే నిఫ్టీ కూడా 16500 ఎగువన ట్రేడ్ అవుతోంది. ఇండస్ ఇండ్, హిందాల్కో, టాటా, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టపోతున్నాయి. అలాగే ఫలితాల ప్రభావంతో టెక్ సంస్థ విప్రో షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
రూపాయి మరో ఆల్ టైం కనిష్టం
అటు డాలరుమారకంలో రూపాయి మరో ఆల్ టైంకనిష్టానికి చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక పైసా క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 80.06ని టచ్ చేసింది. గత సెషన్ 79.98 తో పోలిస్తే 80.01 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం 80.03 వద్ద కొనసాగుతోంది.