![Today Stock Market Closing In Sakshi Money Mantra July 26th 2023](/styles/webp/s3/article_images/2023/07/26/Market.jpg.webp?itok=YeM0DmQ3)
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చేశాయి. మూడు రోజుల వరుస నష్టాలనుచెక్ చెప్పిన దలాల్ స్ట్రీట్ భారీ లాభాలతో కొత్త రికార్డులను తాకింది. ఆరంభంలో నష్టాలను చేసిన సూచీలు చివర్లో బాగా పుంజుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, FMCG, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, ఫార్మా, ఐటీ షేర్లు నష్ట పోయాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 19750కి ఎగువన ముగిసింది.
సరికొత్త ఆల్-టైమ్ హై
జూలై 26న ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 351 పాయింట్లుఎగిసి 66,707 నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 19,979 వద్ద ముగిశాయి. దాదాపు 1,718 షేర్లు పురోగమించగా, 1,574 క్షీణించాయి.
టాటా మెటార్స్, వొడాఫోన్‌ఇండియా, లార్సెన్, ఐటీసీ, బ్రిటానియీ, రిలయన్స్,సన్‌ఫార్మ టాప్ గెయినర్స్‌గా నిలవగా, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ ఎం,టెక్ మహీంద్ర, అపోలో భారీగా నష్టపోయాయి.
రూపాయి: మంగళవారం నాటి ముగింపు 81.87తో పోలిస్తే భారత రూపాయి డాలర్ మారకంలో 13 పైసలు తగ్గి 82 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment