
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఏప్రిల్ 26న నిఫ్టీ 17800 ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగిసి 60,300 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 17,814 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుసగా అయిదో సె షన్‌లో కూడా లాభాలనార్జించాయి.మెటల్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించగా, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, పవర్, ఎఫ్‌ఎంసిజి, పిఎస్‌యు బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు 0.4-1 శాతం వరకు పెరిగాయి.
నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి వొడాఫోన్ ఐడియా టాప్ గెయినర్స్ కాగా, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్ , ఎన్‌టిపిసి నష్టపోయాయి.
మంగళవారం ముగింపు 81.91తో పోలిస్తే బుధవారం డాలర్‌తో రూపాయి 15 పైసలు పెరిగి 81.76 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment