
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లోకొనసాగుతున్నాయి. వరుసగా లాభాలను కొనసాగుతున్న సూచీలు వారాంతంలో కూడా జోష్‌గా ఉన్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగాఎగిసింది. నిఫ్టీ 19,100ను తాకింది. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాలు, ప్రధానంగా ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు షేర్ల లాభాలు మార్కెట్‌కు మద్దతిస్తున్నాయి. సెన్సెక్స్ 460 పాయింట్ల లాభంతో 64,376 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగిసి 19,095 వద్ద కొనసాగుతున్నాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ బ్రిటానియా టాప్ లూజర్స్‌గా ఉండగా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ ఎం, టెక్ ఎం, హీరో మోటో, ఇండస్ బ్యాంకు భారీగా లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment