
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో పాజిటివ్ నోట్‌తో ఉన్న కీలకసూచీలు మిడ్‌సెషన్‌లో మరింత ఎగిసాయి. చివరికి సెన్సెక్స్ 442 పాయింట్లు ఎగిసి 59245 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లు లాభపడి 17665 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు పాజిటివ్‌గా ముగిసాయి. సెన్సెక్స్ మళ్లీ 59 వేల స్ఠాయిని నిలబెట్టుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి.
హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, సన్‌ఫార్మ, రిలయన్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇంకా టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టిపిసి, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా లాభపడ్డాయి. అటు బజాజ్‌ఆటో, నెస్లే, బ్రిటానియా,ఐషర మోటార్స్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 79.84 వద్ద ఉంది.
ఇది చదవండి: చైనా లోన్ యాప్స్: పేటీఎం, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీలకు ఈడీ షాక్!
పేటీఎంకు షాక్
మరోవైపు చైనా లోన్‌యాప్స్ కేసులో ఈడీ సోదాల నేపథ్యంలో చెల్లింపుల సంస్థ పేటీఎం భారీగా నష్ట పోయింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో దాదాపు 6 శాతం కుప్పకూలింది. చైనీస్ నియంత్రణలో ఉన్న కొన్ని ఇన్‌స్టంట్ యాప్ ఆధారిత లోన్ డిషింగ్ ఎంటిటీలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి గతవారం పేటీఎం, రేజర్ పే, క్యాష్‌ఫ్రీ బెంగళూరులోని కార్యాలయాల్లో ఈడీ దాడులు చేసింది. దాదాపు 17 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది ఈడీ.