
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రోజు ట్రేడ్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. కీలక సూచీలు రెండూ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, మెటల్ సహా దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గా ఉన్నాయి. సెన్సెక్స్ 270 పాయింట్లు ఎగిసి 59356 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 17679 వద్ద ట్రేడవుతున్నాయి.
భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, దివీస్, టైటాన్, యూపిఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ మేజర్‌గా లాభపడు తున్నాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ నష్టపోతున్నాయి.
ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో గురువారం ప్రారంభంలో భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు వరుసగా మూడో సెషన్‌లో లాభపడ్డాయి. అంతేకాదు వరుసగా ఆరవ వారంలో వారాంతపు లాభాల వైపు పయనిస్తున్నాయి.
అటు డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ స్వల్పంగా లాభపడుతోంది. ఫెడరల్ రిజర్వ్ జాక్సన్ హోల్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో డాలర్ బలహీనత కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 79.80 వద్ద ఉంది.