
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సూచనలు ఉన్నప్పటికీ శుక్రవారం వరుసగా రెండవ సెషన్‌లోనూ లాభాల్లో షురూ అయ్యాయి. ఆ తరువాత మరింత పుంజుకుని ప్రస్తుతం 373 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 60వేల మార్క్‌ను దాటేయగా, నిఫ్టీ 101 పాయింట్లు జంప్ చేసి 17837 స్థాయికి చేరింది.దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి.
బజాజ ఆటో, ఓఎన్జీసీ, రిలయన్స్, కోల్ ఇండియా , మారుతి సుజుకి భారీగా లాభపడుతుండగా, టాటా స్టీల్, హిందాల్కో, సన్‌ఫార్మా, దివీస్ లాబ్స్ తదితరాలు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి పాజిటివ్‌గా ఉంది. 17 పైసలు ఎగిసి 82.35 వద్ద ఉంది.