
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. చైనాలో మరోసారి కరోనా విస్తరణ, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేస్తున్నారు. అయితే మూడు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన సెన్సెక్స్ ఆరంభంలో లాభాలతో మురిపించింది. రోజంతా పటిష్టంగా కొనసాగి చివరకు సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో 61,419 వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 18,244 వద్ద ముగిసింది.
ఐటీ, మెటల్ పీఎస్‌యూ బ్యాంక్ తోపాటు, దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. రియాల్టీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంది. ఇండస్ ఇండ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిం టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు నెస్లే, బీపీసీఎల్, కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్, టాప్ లూజర్స్‌గా ముగిసాయి. అటు డాలరు మారకంలోరూపాయి 12 పైసలు ఎగిసి 81.67 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment