సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. వరుస లాభాలతో సెన్సెక్స్ 60వేల స్థాయిని దాటేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 5 తరువాత సెన్సెక్స్ మళ్లీ ఈ స్థాయికి చేరడం గమనార్హం. సెన్సెక్స్ 282 పాయింట్లు ఎగిసి 600124 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 17904 వద్ద పటిష్టంగా ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళలాడు తున్నాయి.
అటు డాలరుమారకంలో రూపాయి 43పైసలు ఎగిసి 79. 31 వద్ద కొనసాగుతోంది.
గ్లోబల్ ఆర్థిక మందగమన ఆందోళనల మధ్య మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధరలు 3 శాతం పడిపోయి బ్యారెల్ 92 డాలకంల పడిపోవడంతో ఆరు నెలల కనిష్ట స్థాయి నుండి మార్కెట్ కొంత కోలుకుంది. విదేశీ మూలధన ప్రవాహం కరెన్సీ , దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఊతమిస్తోంది. గత నాలుగు వారాల్లో దాదాపు 11 శాతం లాభపడటం వల్ల 2022లో బెంచ్‌మార్క్ నష్టాలన్నింటినీ తిరిగి సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment