
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. సెన్సెక్స్ ఏకంగా 710 పాయింట్లు పెరిగి 61,764 వద్ద, నిఫ్టీ 50 195 పాయింట్లు లాభపడి 18,264 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంక్, ఫైనాన్స్, ఆటో , రియల్టీ షేర్లు లాభాల్లో ముగిసాయి.
అటు రెండు అదానీ గ్రూప్ స్టాక్‌లలో ఫ్రీ ఫ్లోట్‌ను తగ్గించాలని ఎంఎస్‌సీఐ నిర్ణయం తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 5 శాతం. బజాజ్ ఫైనాన్స్ ,టాటా మోటార్స్ , బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, , HCL టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ , ఇండెక్స్ హెవీవెయిట్‌లు రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. కోల్ ఇండియా దాదాపు 2శాతం క్షీణించగా, సన్ ఫార్మా, లార్సెన్ అండ్ టూబ్రో నెస్లే కూడా నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 2 పైసలు తగ్గి 81.80 వద్ద స్థిరపడింది.
లాభాలకు కారణాలు
దేశీయ మార్కెట్‌లో ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, చమురు ధరల పతనం, క్యూ4లో కంపెనీల లాభాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్ సూచీలకు ఊతమిచ్చాయి. విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ 777.68 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.79 శాతం పెరిగి 76.65 డాలర్లకు చేరుకుంది.