సాక్షి ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లోముగిసాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయంప ఎదురు చూస్తున్న క్రమంలో ఇన్వెస్టర్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 85.35 పాయింట్ల లాభపడి 63,229 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40 పాయింట్లు లాభంతో 18,756 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు బ్యాంకింగ్, మీడియాలో షేర్లు నష్టపోయాయి
టాటా కన్యూమర్స్ ప్రొడక్ట్స్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటామోటార్స్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ టాప్ విన్సర్స్‌గానూ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ టూప్‌లూజర్స్‌గానూ నిలిచాయి. అటు డాలరుమారకంలో భారత కరెన్సీ రూపాయి 27 పైసలు బలపడి 82.11 వద్ద ముగిసింది.
మరిన్ని మార్కెట్‌వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment