Metal shares
-
మెటల్స్ షైన్, మూడో రోజు లాభాల్లో,రికార్డు స్థాయికి దగ్గర్లో
సాక్షి ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లోముగిసాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయంప ఎదురు చూస్తున్న క్రమంలో ఇన్వెస్టర్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 85.35 పాయింట్ల లాభపడి 63,229 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40 పాయింట్లు లాభంతో 18,756 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు బ్యాంకింగ్, మీడియాలో షేర్లు నష్టపోయాయి టాటా కన్యూమర్స్ ప్రొడక్ట్స్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటామోటార్స్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ టాప్ విన్సర్స్గానూ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ టూప్లూజర్స్గానూ నిలిచాయి. అటు డాలరుమారకంలో భారత కరెన్సీ రూపాయి 27 పైసలు బలపడి 82.11 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్ -
మూడోరోజూ ముందుకే
ముంబై: మెటల్ షేర్లు రాణించడంతో దేశీయ మార్కెట్ మూడో రోజూ ముందుకే కదలింది. అలాగే ఇటీవల కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 27 పైసలు ర్యాలీ చేసి సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 49 వేలపైన 49,206 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 14,823 వద్ద నిలిచింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ షేరు రెండుశాతం లాభపడి సూచీల ర్యాలీకి తోడ్పాటును అందించింది. మెటల్ షేర్లకు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఆల్‌టైం హైకి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) శుక్రవారం రూ. 211 లక్షల కోట్లను తాకింది. ఇది సరికొత్త రికార్డు కాగా.., వరుస మూడు రోజుల మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 4.39 లక్షల కోట్లు పెరిగింది. ఢ -
Stock Market: నష్టాల్లోంచి.. లాభాల్లోకి..!
ముంబై: దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు గురువారం ఆరంభ నష్టాలను పూడ్చుకొని లాభాల్లో ముగిశాయి. కరోనా కేసుల కట్టడికి వచ్చే నెల(మే) ఒకటవ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాలను మెప్పించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా ఉదయం సెషన్లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 375 పాయింట్ల లాభంతో 48,081 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 110 పాయింట్ల లాభాన్ని మూటగట్టుకొని 14,406 వద్ద నిలిచింది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని చూపారు. మెటల్ షేర్లు కూడా రాణించి సూచీల ర్యాలీకి సహకరించాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభా ల్లో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 909 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.850 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఆరుపైసలు క్షీణించి 74.94 వద్ద స్థిరపడింది. ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి... కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలను దాటడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు మొగ్గు చూపడంతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది.సెన్సెక్స్ 204 పాయింట్ల నష్టంతో 47,502 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లను కోల్పోయి 14,219 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు దూకుడు మీదున్నా.., దేశీయంగా పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో విక్రయాల ఉధృతి మరింత పెరిగింది. దీంతో సెన్సెక్స్ 501 పాయింట్లు మేర నష్టపోయి 47,204 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లను కోల్పోయి 14,424 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఆర్థిక, బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు మిడ్‌సెషన్ కల్లా నష్టాలను పూడ్చుకోగలిగాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో సూచీలు క్రమంగా లాభాలను ఆర్జించుకోగలిగాయి. ► హెచ్‌డీఎఫ్‌సీతో వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 7% లాభంతో రూ.176 వద్ద ముగిసింది. ► నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఏడు శాతం పెరిగి రూ.453 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల విడుదల ముందు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 4% లాభపడి రూ.579 వద్ద నిలిచింది. నిఫ్టీ @ సిల్వర్ జూబ్లీ ... ఎన్ఎస్ఈలోని ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గురువారం అరుదైన ఘనతను సాధించింది. 1995 బేస్ ఇయర్ ప్రతిపాదికన 1996 ఏప్రిల్ 22 తేదీన 1,107 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన నిఫ్టీ దిగ్విజయంగా 25 వసంతాలను పూర్తి చేసుకుంది. కాంపౌండెడ్‌గా ప్రతి ఏటా 11 శాతం వృద్ధి చెందుతూ గడిచిన పాతికేళ్లలో 14 రెట్లు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న 15 వేల మార్కును అధిగమించింది. ఈ పాతికేళ్ల ప్రయాణంలో నిఫ్టీ ఇండెక్స్‌లో అనేక మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ.., హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, గ్రాసీం, హీరో మోటోకార్ప్, హిందాల్కో షేర్లు మాత్రం ఈ రోజుకు కొనసాగుతున్నాయి. -
రెండోరోజూ తడబాటే..!
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అస్థిరత కొనసాగింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 667 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ 20 పాయింట్లు పతనమై 51,309 వద్ద స్థిరపడింది. అలాగే ట్రేడింగ్ సమయంలో 15,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ సూచీ చివరికి మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 15,106 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ‘‘సూచీలు గరిష్ట స్థాయిలకు చేరుకోవడాన్ని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అవకాశంగా మలుచుకున్నారు. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. మరోవైపు ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లలో చెప్పుకొదగిన స్థాయిలో కొనుగోళ్లు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు ఇంట్రాడేలో భారీ ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. అమెరికా కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండటంతో అక్కడి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మన మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశంగా మారొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ తెలిపారు. కొనసాగిన ఒడిదుడుకులు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 51,356 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 15,119 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన కంపెనీ షేర్లు రాణించడంతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 184 పాయింట్లు పెరిగి 51,513 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 15,168 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో సూచీల గరిష్టస్థాయిల వద్ద ఒక్కసారిగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, ఎస్బీఐ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 667 పాయింట్లను నష్టపోయి 50,846 వద్దకు, నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడే హై నుంచి 191 పాయింట్లు నష్టపోయి 14,977 స్థాయికి దిగివచ్చాయి. అయితే చివరి అరగంటలో ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు
న్యూఢిల్లీ: కనిష్ట స్థాయిల వద్ద మెటల్, ఫైనాన్స్, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. సెనెక్స్ 255 పాయింట్లు పెరిగి 39,983 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,762 వద్ద స్థిరపడ్డాయి. మునుపటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు దిగివచ్చాయి. అలాగే ధరలు గరిష్టస్థాయిల నుంచి కనిష్టాలకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అయితే ఐటీ, మీడియా షేర్లు మాత్రం స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లకుగానూ 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఐఐలు, డీఐఐలు ఇరువురూ శుక్రవారం నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఎఫ్ఐఐలు రూ.479 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.430 కోట్ల షేర్లను విక్రయించారు. ఈ వారంలో సెనెక్స్ 526.51 పాయింట్లు(1.29 శాతం), నిఫ్టీ 157.75 పాయింట్లను కోల్పోయాయి. రెండోదశ కరోనా కేసుల విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వైఖరి నెలకొని ఉంది. మెరిసిన మెటల్ షేర్లు–ఐటీలో అమ్మకాలు... కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న మెటల్ షేర్లలో శుక్రవారం అనూహ్య ర్యాలీ చోటుచేసుకుంది. టాటా స్టీల్ (5.5 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (6.7 శాతం) షేర్ల అండతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం లాభంతో ముగిసింది. అయితే ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగడంతో ఈ రంగ షేర్లు ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్‌తో పాటు బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్స్ షేర్లలో ర్యాలీ కూడా బెంచ్‌మార్క్ సూచీలకు కలిసొచ్చింది. ఒక దశలో సెన్సెక్స్ 398 పాయింట్లు పెరిగి 40,126 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 11,790 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ‘నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌లో 11,500 వద్ద బలమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. రెండో త్రైమాసిక ఫలితాలు, ఉద్దీపన ప్యాకేజీ ప్రణాళికల వార్తలు రానున్న రోజుల్లో మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. ఐటీ, టెలికం, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లోని సానుకూలతల దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ షేర్లు రాణించే అవకాశం ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ‘నిఫ్టీలో కన్సాలిడేషన్ జరిగేందుకు అవకాశం ఉన్నట్లు సంకేతాలు సూచిస్తున్నాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని., ఇరువైపుల పొజిషన్లను మెయిన్టైన్ చేసుకోవాలని మా కస్టమర్లకు సలహానిస్తున్నాము’ అని రెలిగేర్ బ్రోకింగ్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. ► హెచ్‌సీఎల్ టెక్ షేరు 3% క్షీణించింది. ► క్యూ2 ఆదాయ వృద్ధి మందగించడంతో మైండ్ ట్రీ షేరు 7 శాతం నష్టాన్ని చవిచూసింది. ► అనుబంధ సంస్థ ఆడిటర్ రాజీనామా తో యూపీఎల్ షేరు 8% క్షీణించింది. ► ఎన్ఎస్ఈలో 89 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. -
బ్యాంక్, లోహ షేర్ల జోరు
217 పాయింట్ల లాభంతో 25,736 పాయింట్లకు సెన్సెక్స్ పటిష్టమైన అంతర్జాతీయం సంకేతాలతో, బ్యాంక్, లోహ షేర్ల ర్యాలీతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 217 పాయింట్లు లాభపడి 25,736 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 7,834 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, ఎఫ్ఎంసీజీ షేర్లు పెరిగాయి. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ లాభాల స్వీకరణ, జీఎస్టీ బిల్లుపై అనిశ్చితి కారణంగా మరింత నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవడంతో కోలుకొని 217 పాయింట్ల లాభంతో 25,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండడం, యూరోప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం, దివాలా బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయన్న అంచనాలు, ఇతర పలు కీలక బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందగలవన్న ఆశలు, రూపాయి వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ బలపడడం.. ఫెడ్ నిర్ణయంపై తొలగిన అనిశ్చితి ఇవన్నీ సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి. నారాయణ హృదయాలయ ఐపీఓకు 8 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్.. ఆరోగ్య సేవలందించే నారాయణ హృదయాలయ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 8.67 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.613 కోట్లు సమీకరించనున్నది. 1.71 కోట్ల ఈక్విటీ షేర్లకు గాను 14 కోట్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్స్) కేటాయించినవాటా 24 రెట్లు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐలు)కు కేటాయించిన వాటా 3.6 రెట్ల చొప్పున సబ్‌స్క్రైబ్ అయింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా1.7 రెట్లు మాత్రమే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. కాగా 15 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.184 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.245-250గా ఉంది. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియాలు లీడ్మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
మెటల్ షేర్ల మెరుపులు
హెచ్చుతగ్గులకు లోనైన సూచీలు ⇒ 50 పాయింట్లు క్షీణించి 27,440కు సెన్సెక్స్ ⇒ 7 పాయింట్ల నష్టంతో 8,325కు నిఫ్టీ రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో లోహ షేర్లు మెరుపులు మెరిపించినప్పటికీ, స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లోనే ముగిసింది. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, వాహన రంగ షేర్లలో లాభాల స్వీకరణకు దిగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి 27.440 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 8,325 పాయింట్ల వద్ద ముగిశాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా తదితర షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓఎన్జీసీ, టీసీఎస్, వేదాంత, హిందూస్తాన్ యూనిలివర్, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, హిందాల్కో, టాటా మోటార్స్ లాభపడడంతో సెన్సెక్స్‌కు భారీ నష్టాలు తప్పాయి. ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రే డవటం కూడా ప్రభావం చూపింది. లోహ, ఇంధన షేర్లు సెన్సెక్స్‌కు తోడ్పాటునందించాయి. సెన్సెక్స్ 27,604-27,338 పాయింట్ల గరిష్ట, కనిస్ట స్థాయిల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 150 పాయింట్లకు పైగా నష్టపోయింది. చైనా నుంచి డిమాండ్ బాగా ఉండటంతో లోహ షేర్లు మెరుపులు మెరిపించాయి. బీఎస్ఈ అన్ని రంగాల సూచీల్లో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడింది. ఉక్కు రంగం రిటర్న్ ఆన్ ఈక్విటీ రెండేళ్లలో రెట్టింపై 14 శాతానికి చేరుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వెల్లడించడంతో లోహ షేర్లు వెలిగిపోయాయి. ఇనుప ఖనిజంపై ఎగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 10 శాతానికి ప్రభుత్వం తగ్గించడం కూడా ప్రభావం చూపింది. ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్ఐఐల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈలో లిస్టయిన కంపెనీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల విలువ జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 19.32 లక్షల కోట్లకు ఎగిసింది. ఇది ఆరేళ్ల గరిష్టం. నరేంద్ర మోది సారథ్యంలోని ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలపై ఆశావహ భావం ఇందుకు కారణం. కన్సల్టెన్సీ సంస్థ ప్రైమ్ డేటాబేస్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2014 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఎఫ్ఐఐల హోల్డింగ్స్ విలువ రూ. 18.3 లక్షల కోట్లుగా ఉండగా, 2015 మార్చి త్రైమాసికానికి రూ. 19.32 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ విలువ రూ. 12.34 లక్షల కోట్లు. అయితే, శాతాల వారీగా చూస్తే ఆయా కంపెనీల్లో ఎఫ్ఐఐల వాటా క్రితం మూణ్నెల్లతో పోలిస్తే తాజా త్రైమాసికంలో 6.54 శాతం నుంచి 6.44 శాతానికి తగ్గింది. నివేదిక ప్రకారం ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో 465 ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా బ్యాంకుల్లో రూ. 3.44 లక్షల కోట్లు, ఆ తర్వాత ఐటీ కంపెనీల్లో రూ. 2.77 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. కంపెనీలపరంగా హెచ్‌డీఎఫ్‌సీలో అత్యధికంగా 79.65 శాతం మేర ఎఫ్ఐఐ హోల్డింగ్స్ ఉన్నాయి. ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,474 కంపెనీల్లో 1,448 సంస్థలు మార్చి త్రైమాసికంలో దాఖలు చేసిన షేర్‌హోల్డింగ్ గణాంకాల ఆధారంగా ప్రైమ్ డేటాబేస్ ఈ నివేదికను రూపొందించింది.