
ముంబై: మెటల్ షేర్లు రాణించడంతో దేశీయ మార్కెట్ మూడో రోజూ ముందుకే కదలింది. అలాగే ఇటీవల కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 27 పైసలు ర్యాలీ చేసి సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 49 వేలపైన 49,206 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 14,823 వద్ద నిలిచింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ షేరు రెండుశాతం లాభపడి సూచీల ర్యాలీకి తోడ్పాటును అందించింది. మెటల్ షేర్లకు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.
ఆల్‌టైం హైకి బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్
బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) శుక్రవారం రూ. 211 లక్షల కోట్లను తాకింది. ఇది సరికొత్త రికార్డు కాగా.., వరుస మూడు రోజుల మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ రూ. 4.39 లక్షల కోట్లు పెరిగింది. ఢ
Comments
Please login to add a commentAdd a comment