
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. దాదాపు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లు కనిపించాయి. ఆరంభంలో 125 పాయింట్ల లాభంతో ఎగిసిన సెన్సెక్స్ చివరికి 350 పాయింట్లు లేదా 0.56 శాతం ఎగిసి 63,143 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు లాభంతో 18,726 వద్ద స్థిరపడ్డాయి.
సెన్సెక్స్ 63వేలకు ఎగువన, నిఫ్టీ 18,700కి ఎగువన బలమైన నోట్‌తో ముగిశాయి. అంతర్జాతీ సంకేతాలకు తోడు, ఆర్బీఐ రానున్న పాలసీ రివ్యూలో వడ్డీరేటు పెంపు ఉండదనే అంచనాల మధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు)
నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బిపిసిఎల్, నెస్లే ఇండియా మరియు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ అత్యధికంగా లాభపడగా, సిప్లా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్‌ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో రూ. 286.6 లక్షల కోట్ల నుండి రూ. 289 లక్షల కోట్లకు పెరిగింది, పెట్టుబడిదారులు ఒకే రోజులో రూ 2.4 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్‌డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం )