
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఆరంభంలో 200 పాయింట్లకు పైగా నష్టపోయిన మార్కెట్ భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంది. చివరికి నష్టాలను తగ్గించుకొని లాభాల్లో ముగిసింది. 243 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 61275వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 18015వద్ద ముగిసింది. పలితంగా నెల గరిష్టంత వద్ద, సెన్సెక్స్ 61 వేలకుఎగువన, నిఫ్టీ 18వేలకు ఎగువన స్థిరపడటం గమనార్హం. మంగళవారం ప్రకటించిన డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం 24 నెలల కనిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా మారింది.
హెచ్‌యూఎల్, సన్‌ఫార్మ, ఐటీసీ లార్సెన్, ఓఎన్‌జీసీ భారీగా నష్టపోగా టెక్ మహీంద్రా దాదాపు 6 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం, ఐషర్ మోటార్స్ అదానీఎంటర్‌ప్రైజెస్ లాభపడ్డాయి. అటుడాలరు మారకంలో రూపాయి 82.80 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment