
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 98 ఎగిసింది. కానీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో వెంటనే సెన్సెక్స్ 16 పాయింట్ల లాభానికి పరిమితమై 59279 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17678 వద్ద కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, సిప్లా లాభపడుతున్నాయి. అటు నెస్లే, కోటక్ మహీంద్ర, ఓఎన్జీసీ, ఆసియన్ పెయింట్స్, విప్రో నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం ముగింపు 79.85తో పోలిస్తే 79.83 వద్ద ప్రారంభమైంది. అనంతరం 12 పైసలు పడిపోయి 79.90 స్థాయిని టచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment