
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య భారతీయ షేర్ మార్కెట్ సానుకూలంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ 394 పాయింట్లు ఎగిసి 59939 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17775 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు నెలవారీ F&O గడువు ముగియనుంది. దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగే అవకాశం ఉంది.
దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ లాభపడుతుండగా, ఎన్‌టిపిసి, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నష్టాల్లో ఉన్నాయి. కాగా బలిప్రతిపాద సందర్భంగా బీఎస్‌ఈ, ఎన్‌సీఈ మార్కెట్లకు బుధవారం సెలవు.