
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. ఆరంభం లాభాలను స్థిరంగా నిలబెట్టు కుంటున్న సెన్సెక్స్ ప్రస్తుతం 295 పాయింట్లు పెరిగి 59,070 వద్ద , నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 17,621 వద్ద ఉన్నాయి. నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగియడంతో గురువారం ఐటీ, బ్యాంకింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
దాదాపు అన్నిరంగాలు లాభాల్లో ఉన్నాయి. టైటన్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో నష్ట పోతున్నాయి. అటు డాలరుమారకంలో రూపాయల 4 పైసల నష్టంతో 79.91 వద్ద 80 మార్క్ పతనానికి సమీపంలో ఉంది.
ఐషర్ మోటార్స్ టాప్ లూజర్
ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ఐషర్ మోటార్స్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రాజీనామా చేయడంతో ఐషర్ మోటార్స్ 3 శాతానికి పైగా పతనమైంది. సీఎఫ్‌వో కాళేశ్వరన్ అరుణాచలం తన రాజీనామాను సమర్పించారని కంపెనీ వెల్లడించింది. సెప్టెంబర్ 2న పనివేళలు ముగిసే సమయానికి అమల్లోకి వస్తుందని తన ఫైలింగ్‌లో తెలిపింది. రాజీనామాకు గల కారణాలను సంస్థ వెల్లడించలేదు. కాగా ఏడాది కాలంలో సంస్థకు గుడ్‌బై చెప్పిన సీనియర్ ఉద్యోగుల్లో ఇది తాజాది కావడం గమనార్హం. గతేడాది ఆగస్టులో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో వినోద్ దాసరి రాజీనామాతో నిష్క్రమణల పరంపర మొదలైంది. తరువాత చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ లలిత్ మాలిక్, నేషనల్ బిజినెస్ హెడ్ పంకజ్ శర్మ కూడా రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment