Eicher Motors
-
ఐషర్ మోటార్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 741 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 456 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,973 కోట్ల నుంచి రూ. 3,913 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,416 కోట్ల నుంచి రూ. 3,006 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో వాణిజ్య వాహన భాగస్వామ్య సంస్థ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ 13 శాతం వృద్ధితో 18,162 యూనిట్లను విక్రయించినట్లు ఐషర్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు సైతం 31 శాతం జంప్‌చేశాయి. 2,19,898 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గత కొద్ది నెలలుగా ప్రవేశపెట్టిన కొత్త మోడళ్లు హంటర్ 350, సూపర్ మీటియోర్ 650కు అంతర్జాతీయంగా డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఎండీ సిద్ధార్థ లాల్ తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం నీరసించి రూ. 3,180 వద్ద ముగిసింది. -
ఐషర్ సీఎఫ్‌వోగా విద్య శ్రీనివాసన్
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విద్య శ్రీనివాసన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆమె బాటా ఇండియా ఫైనాన్స్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆమెకు ఫైనాన్స్, స్ట్రాటజీ, బిజినెస్ ప్లానింగ్, లీగల్, కమర్షియల్ కార్యకలాపాల్లో 24 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. ప్యూమా స్పోర్ట్స్ ఇండియా, ఆదిత్య బిర్లా, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ వంటి సంస్థల్లోనూ పనిచేశారు. చదవండి: భారత్‌లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం! -
సీఎఫ్‌వో గుడ్‌బై, ఐషర్ మోటార్స్ ఢమాల్!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. ఆరంభం లాభాలను స్థిరంగా నిలబెట్టు కుంటున్న సెన్సెక్స్ ప్రస్తుతం 295 పాయింట్లు పెరిగి 59,070 వద్ద , నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 17,621 వద్ద ఉన్నాయి. నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగియడంతో గురువారం ఐటీ, బ్యాంకింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు అన్నిరంగాలు లాభాల్లో ఉన్నాయి. టైటన్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో నష్ట పోతున్నాయి. అటు డాలరుమారకంలో రూపాయల 4 పైసల నష్టంతో 79.91 వద్ద 80 మార్క్ పతనానికి సమీపంలో ఉంది. ఐషర్ మోటార్స్ టాప్ లూజర్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ఐషర్ మోటార్స్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రాజీనామా చేయడంతో ఐషర్ మోటార్స్ 3 శాతానికి పైగా పతనమైంది. సీఎఫ్‌వో కాళేశ్వరన్ అరుణాచలం తన రాజీనామాను సమర్పించారని కంపెనీ వెల్లడించింది. సెప్టెంబర్ 2న పనివేళలు ముగిసే సమయానికి అమల్లోకి వస్తుందని తన ఫైలింగ్‌లో తెలిపింది. రాజీనామాకు గల కారణాలను సంస్థ వెల్లడించలేదు. కాగా ఏడాది కాలంలో సంస్థకు గుడ్‌బై చెప్పిన సీనియర్ ఉద్యోగుల్లో ఇది తాజాది కావడం గమనార్హం. గతేడాది ఆగస్టులో రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో వినోద్ దాసరి రాజీనామాతో నిష్క్రమణల పరంపర మొదలైంది. తరువాత చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ లలిత్ మాలిక్, నేషనల్ బిజినెస్ హెడ్ పంకజ్ శర్మ కూడా రాజీనామా చేశారు. -
ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో అంచనాలకు తగిన ఫలితాలు సాధించడంతోపాటు.. ఆశావహ అంచనాల కారణంగా ఆటో రంగ కంపెనీ ఐషర్ మోటార్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఇండియాబుల్స్ రియల్టీ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐషర్ మోటార్స్ నికర లాభం 40 శాతం క్షీణించి రూ. 343 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం నీరసించి రూ. 2,134 కోట్లను తాకింది. రాయల్ ఎన్ఫీల్డ్ 9 శాతం తక్కువగా 1,49,120 మోటార్ సైకిళ్లను విక్రయించింది. వోల్వో గ్రూప్‌తో ఏర్పాటు చేసిన జేవీ వీఈ కమర్షియల్ వెహికల్స్ ఆదాయం 13 శాతం వెనకడుగుతో రూ. 1,703 కోట్లకు చేరింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 5.4 శాతం నుంచి 6.9 శాతానికి బలపడ్డాయి. ప్రస్తుతం నెలకు 70,000 యూనిట్ల తయారీ స్థాయికి చేరినట్లు ఐషర్ మోటార్స్ యాజమాన్యం తాజాగా పేర్కొంది. బుకింగ్స్ సైతం 1.25 లక్షల యూనిట్లకు చేరినట్లు తెలియజేసింది. దీంతో క్యూ3లో పనితీరు మెరుగుపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతంపైగా జంప్‌చేసి రూ. 2,498ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా..ఈ షేరు గత వారం 15 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! చదవండి: (అరబిందో- ఐబీ హౌసింగ్- క్యూ2 ఖుషీ) ఐబీ రియల్టీ రాకేష్ జున్జున్వాలకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ ఓపెన్ మార్కెట్ ద్వారా ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన 5 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ ఈక్విటీలో 1.1 శాతం వాటాకు సమానమైన వీటిని గురువారం షేరుకి రూ. 57.73 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు దాదాపు రూ. 29 కోట్లను వెచ్చించినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. కాగా.. ఇదే సమయంలో మోర్గాన్ స్టాన్లీ 7.58 మిలియన్ షేర్లను రూ. 57.73 సగటు ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీ రియల్టీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 16 శాతం దూసుకెళ్లింది. రూ. 64కు చేరింది. ప్రస్తుతం 12 శాతం లాభంతో రూ. 61.50 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 30 శాతంపైగా లాభపడటం విశేషం! -
ఐషర్ మోటార్స్ స్పీడ్- మిండా.. స్కిడ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ 60 పాయింట్లవరకూ ఎగసింది. కాగా.. షేర్ల విభజనకు రికార్డ్ డేట్ తదుపరి దేశీ ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభంకానుండటంతో ఆటో విడిభాగాల కంపెనీ మిండా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఐషర్ లాభాలతో సందడి చేస్తుంటే.. మిండా నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ షేర్ల విభజనకు రికార్డ్ డేట్(25) కావడంతో ఐషర్ మోటార్స్ కౌంటర్ ఎక్స్ స్ప్లిట్‌కు చేరింది. ఫలితంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుతఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 2,387ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 2,320 వద్ద ట్రేడవుతోంది. రూ. 10 ముఖ విలువల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా(10:1) విభజిస్తున్న విషయం విదితమే. షేరు ధర భారీగా పెరిగిన కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం అందుబాటులో ఉండే విధంగా కంపెనీ షేర్ల విభజనను చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా ఈ కౌంటర్లో లిక్విడిటీ పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. మిండా ఇండస్ట్రీస్ మంగళవారం(25) నుంచి రైట్స్ ఇష్యూ ప్రారంభంకానున్న నేపథ్యంలో మిండా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 4 శాతం పతనమై రూ. 326కు చేరింది. ప్రస్తుతం 3.2 శాతం క్షీణతతో రూ. 332 దిగువన ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మిండా ఇండస్ట్రీస్ రూ. 53 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 5 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం సైతం 73 శాతం పడిపోయి రూ. 228 కోట్లకు పరిమితమైంది. కాగా.. సెప్టెంబర్ 8న ముగియనున్న రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 250 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. -
ఐషర్ మోటార్స్- 3ఎం ఇండియా.. క్యూ1 షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం 3ఎం ఇండియా కౌంటర్ బలహీనపడింది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించడంతో ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ కౌంటర్లో సైతం అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళ తప్పాయి. కోవిడ్-19 కట్టడికి లాక్డౌన్ల అమలు కారణంగా క్యూ1లో ఈ కంపెనీల పనితీరు మందగించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 3ఎం ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో 3ఎం ఇండియా రూ. 40 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 85 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 748 కోట్ల నుంచి రూ. 327 కోట్లకు పడిపోయింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం రూ. 42.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3ఎం ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.5 శాతం పతనమై రూ. 20,915 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 20,800 వరకూ తిరోగమించింది. ఐషర్ మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఐషర్ మోటార్స్ రూ. 55 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 452 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2382 కోట్ల నుంచి రూ. 818 కోట్లకు భారీగా క్షీణించింది. ఇబిటా రూ. 614 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 20,810 వద్ద ట్రేడవుతోంది. -
ఐషర్- దిలీప్ బిల్డ్‌కాన్.. రయ్రయ్
మిడ్‌సెషన్ నుంచీ జోరందుకున్న మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్, మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్ బిల్డ్‌కాన్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజించేందుకు బోర్డు అనుమతించిన నేపథ్యంలో ఐషర్ మోటార్స్ కౌంటర్ దూకుడు చూపుతోంది. తాజాగా ఎన్ఎస్ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 20,916 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 20,970 వరకూ ఎగసింది. వెరసి గత రెండు నెలల్లో 49 శాతం దూసుకెళ్లింది. గత నెల 12న కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో షేర్ల విభజనకు అనుమతించాక ఈ కౌంటర్ ర్యాలీ బాట పట్టిన విషయం విదితమే. మే 25న తొలిసారి కంపెనీ షేర్ల విభజనకు ప్రతిపాదించడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దిలీప్ బిల్డ్‌కాన్ హెచ్సీసీతో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) గుజరాత్ నుంచి రూ. 4168 కోట్ల విలువైన ఈపీసీ కాంట్రాక్టును పొందినట్లు దిలీప్ బిల్డ్‌కాన్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9.5 శాతం దూసుకెళ్లి రూ. 309 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 312 వరకూ ఎగసింది. కాంట్రాక్టులో భాగంగా జేవీ డీబీఎల్-హెచ్‌సీసీ భడ్భట్ బ్యారేజీ నిర్మాణంతోపాటు వరద రక్షణ గోడల ఏర్పాటు తదితరాలను చేపట్టవలసి ఉంటుందని దిలీప్ బిల్డ్‌కాన్ తెలియజేసింది. నర్మదా వాటర్ రీసోర్స్, గుజరాత్ నుంచి ఈ కాంట్రాక్టును పొందినట్లు వివరించింది. -
ఐషర్- యూఫ్లెక్స్ షేర్లు భల్లేభల్లే
విదేశీ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 554 పాయింట్లు జంప్‌చేసి 32,160ను తాకగా.. నిఫ్టీ 156 పాయింట్లు ఎగసి 9,471 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్, ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ దిగ్గజం యూఫ్లెక్స్ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటు, లిక్విడిటీ పెంపునకు వీలుగా షేరు ముఖ విలువను విభజించే యోచనలో ఉన్నట్లు ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ ఐషర్ బ్రాండుతో వాణిజ్య వాహనాలు, బస్సులపాటు రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ మోటార్ సైకిళ్లను సైతం రూపొందించే సంగతి తెలిసిందే. కాగా.. రూ. 10 ముఖ విలువగల షేరు విభజన ప్రతిపాదనపై జూన్ 12న నిర్వహించనున్న కంపెనీ బోర్డు సమావేశంలో నిర్ణయించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సర(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 16,320 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 16,430 వరకూ ఎగసింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రాయల్ ఎన్ఫీల్డ్ వాహన విక్రయాలు 17 శాతం క్షీణించి 1.63 లక్షలకు పరిమితమైనట్లు తెలుస్తోంది. యూఫ్లెక్స్ లిమిటెడ్ ఫ్లెక్స్ ప్రొటెక్ట్ పేరుతో వ్యక్తిగత రక్షణ కల్పించగల కవరాల్ ప్రొడక్టును రూపొందించినట్లు ప్యాకేజింగ్ సొల్యూషన్ల కంపెనీ యూఫ్లెక్స్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఐఐటీ, ఐఎన్ఎంఏఎస్, డీఆర్డీవో ఢిల్లీతో కలసి సంయుక్తంగా ఈ ప్రొడక్టును అభివృద్ఢి చేసినట్లు తెలియజేసింది. నాలుగు లేయర్ల రక్షణతోపాటు.. యాంటీమైక్రోబయల్ కోటింగ్‌తో ఫ్లెక్స్ ప్రొటెక్ట్‌ను తయారు చేసినట్లు వివరించింది. ఈ ప్రొడక్టుకు డీఆర్డీవో అనుమతి లభించినట్లు తెలియజేసింది. కోవిడ్-19 సోకినవారికి వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్యకర్తలకు ఈ ప్రొడక్ట్ ప్రయోజనకరంగా నిలుస్తుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యూఫ్లెక్స్ షేరు 8.5 శాతం జంప్‌చేసి రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 204 వరకూ ఎగసింది. ఈ ప్రొడక్టును కెమిస్టులు, ఈకామర్స్ ద్వారా విక్రయించే సన్నాహాలు చేస్తున్నట్లు యూఫ్లెక్స్ పేర్కొంది. -
ఐషర్ మోటార్స్ లాభం 22% డౌన్
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.452 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం రూ.576 కోట్లతో పోల్చితే 22 శాతం క్షీణించిందని ఐషర్ మోటార్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,548 కోట్ల నుంచి 7% తగ్గి రూ.2,382 కోట్లకు చేరిందని కంపెనీ ఎమ్డీ సిద్ధార్థ లాల్ తెలిపారు. గత క్యూ1లో 2.25 లక్షలు అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు ఈ క్యూ1లో 19 శాతం క్షీణించి 1.81 లక్షలకు తగ్గాయని పేర్కొన్నారు. బీఎస్ సిక్స్ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటంతో ముందస్తు కొనుగోళ్లు జరిగే అవకాశాలుండటం, పండుగల సీజన్ కానుండటంతో ఈ సెప్టెంబర్ నుంచి అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్నివ్యక్తం చేశారు. -
ఐషర్ మోటార్స్ లాభం అంతంతమాత్రమే !
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో స్వల్పంగానే పెరిగింది. గత క్యూ3లో రూ.521 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 2 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు పెరిగిందని ఐషర్ మోటార్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,316 కోట్ల నుంచి రూ.2,488 కోట్లకు చేరుకుంది. టూ వీలర్ల విభాగం, రాయల్ ఎన్ఫీల్డ్ ఆదాయం రూ.2,269 కోట్ల నుంచి 3 శాతమే పెరిగి రూ.2,341 కోట్లకు పెరిగిందని ఐషర్ మోటార్స్ డైరెక్టర్, సీఈఓ సిద్ధార్థ లాల్ తెలిపారు. 6 శాతం తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు గత క్యూ3లో 2.02 లక్షలుగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఈ క్యూ3లో 1.93 లక్షలకు తగ్గాయని సిద్ధార్థ లాల్ వెల్లడించారు. వాణిజ్య వాహన అమ్మకాల కంపెనీ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ (వీఈ సీవీ) ఆదాయం రూ.2,590 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.2,818 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపారు. ప్రీమియమ్ బైక్ అమ్మకాలు పెరుగుతాయ్... గత ఏడాది చివరి ఆరు నెలలు టూవీలర్ మార్కెట్‌కు గడ్డుకాలమని లాల్ వ్యాఖ్యానించారు. బీమా వ్యయాలు పెరగడం, ముడి పదార్ధాలు ధరలు అధికం కావడం, ప్రభుత్వ నిబంధనల కారణంగా భద్రతా ప్రమాణాల పెంపు కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడం... తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపించాయన్నారు. ఖరీదైన బైక్‌ల అమ్మకాలు పెరగడం భవిష్యత్తులో కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐషర్ మోటార్స్ షేర్ 0.79 శాతం నష్టంతో రూ.20,674 వద్ద ముగిసింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 2 సరికొత్త బైక్‌లు
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో రెండు సరికొత్త బైక్‌లు విడుదలకానున్నా యి. ట్విన్ సిలిండర్లు కలిగిన ఈ బైక్‌లు త్వరలోనే భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోనూ లభ్యమవుతాయని కంపెనీ ప్రకటించింది. కాంటినెంటల్ జీటీ 650 పేరిట విడుదలకానున్న బైక్ ధర రూ.4,21,558 కాగా, ఇంటర్‌సెప్టర్ ఐఎన్టీ 650 పేరిట అందుబాటులోకి రానున్న మరో బైక్ ధర రూ.4,90,618 వద్ద నిర్ణయించి నట్లు సంస్థ సీఈఓ సిద్ధార్థ లాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తికానున్న ఈ రెండు బైక్‌లు భారత్ నుంచే అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతికాను న్నాయి. అమెరికా, లండన్, యూరప్ మార్కెట్లతో పాటుగానే ఇక్కడి మార్కెట్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి బైక్‌లను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. -
ఐషర్ మోటార్స్ లాభం రూ.576 కోట్లు
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.576 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం, రూ.460 కోట్లతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని ఐషర్ మోటార్స్ తెలిపింది. గత క్యూ1లో రూ.2,255 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 14% వృద్ధితో రూ.2,548 కోట్లకు పెరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ల అమ్మకాలు 22 శాతం వృద్ధితో 2.25 లక్షలకు చేరుకున్నాయి. ఈ బైక్‌ల ఎగుమతులు 10% పెరిగి 5,636కు చేరాయి. వీఈ కమర్షియల్ వెహికల్స్ బ్రాండ్ కింద విక్రయించే ట్రక్కులు, బస్సుల అమ్మకాలు 41 శాతం వృద్ధితో 16,327కు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐషర్ షేర్ ఫ్లాట్‌గా రూ.27,484 వద్ద ముగిసింద -
ఐషర్ మోటార్స్ లాభం రూ. 520 కోట్లు
న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు, ఇతర వాణిజ్య వాహనాలు తయారు చేసే ఐషర్ మోటార్స్ కంపెనీ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.520 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం రూ.418 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని ఐషర్ మోటార్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,071 కోట్ల నుంచి రూ.2,269 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ లాల్ పేర్కొన్నారు. నిర్వహణ లాభం 23 శాతం వృద్ధితో రూ.707 కోట్లకు పెరిగిందని, మార్జిన్ 31.2 శాతంగా నమోదైందని తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అమ్మకాలు 19 శాతం వృద్ధితో 2,06,000కు పెరిగాయని గత క్యూ3లో 27 శాతంగా ఉన్న ఈ బైక్‌ల మార్కెట్ వాటా ఈ క్యూ3లో 31 శాతానికి పెరిగిందని తెలిపారు. ఎగుమతులు 68 శాతం వృద్ధి చెందాయని వివరించారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈ ఇంట్రాడేలో ఈ షేర్ 3 శాతం వరకూ ఎగసి, చివరకు 1 శాతం లాభంతో రూ.27,911 వద్ద ముగిసింది. -
డుకాటి కొనుగోలుకు ఐషర్ భారీ బిడ్
సాక్షి, ముంబై: ఇటాలియన్ సూపర్ బైకు తయారీదారి డుకాటిని సొంతం చేసుకోవడానికి దేశీయ కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయ దిగ్గజ క్లాసిక్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే డుకాటిని కొనుగోలుచేయనున్నట్టు వార్తలు రాగ.. తాజాగా దీనికోసం రాయల్ ఎన్ఫీల్డ్ పేరెంట్ కంపెనీ ఐషర్ మోటార్స్ బైండింగ్ ఆఫర్‌ను కూడా రూపొందించిందని తెలుస్తోంది. డుకాటి కోసం 1.8 బిలియన్ డాలర్ల(రూ.11,524కోట్లకు పైన) నుంచి 2 బిలియన్ డాలర్ల(రూ.12,806 కోట్లు)కు బిడ్ వేసినట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఒకవేళ ఈ ఆఫర్ విజయవంతమైతే, ఐషర్ మోటార్స్ పోర్టుఫోలియోకు బూస్ట్ వస్తుందని తెలుస్తోంది. అంతేకాక ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండు ఐషర్ మోటార్స్ చేతికి వస్తుంది. డుకాటి వేలంలో పాల్గొంటున్న ఏకైక ఆసియన్ కంపెనీ ఐషరేనని రిపోర్టు తెలిపింది. బ్యాంకులు, కన్సల్టెంట్స్తో ఫైనాన్సింగ్, నిర్మాణ నిబంధనలను ఐషర్ మోటార్స్ ఖరారు చేస్తుంది. డుకాటి సంస్థ జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో భాగంగా ఉంది. డుకాటిని కొనుగోలు చేయాలంటే ఫోక్స్వ్యాగన్తో సంప్రదించవలసి ఉంటుంది. 1.5 బిలియన్ యూరోలకు దీన్ని విక్రయించాలని ఫోక్స్‌వాగన్ చూస్తోంది. ఈబీఐటీడీఏకు ముందున్న ఆదాయాలకు ఇది 14-15 సార్లు అధికం. డుకాటిని విక్రయించగా వచ్చిన ఫండ్లు 2015 ఉద్గారాల స్కాండల్ నుంచి వచ్చిన నష్టాలను పూరించగలవని కంపెనీ భావిస్తోంది. రిపోర్టుల ప్రకారం పలు ఆటో తయారీ కంపెనీలు హార్లీ డేవిడ్సన్, సుజుకీ, బజాజ్ ఆటో, హీరో మోటోకార్పొలు డుకాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. -
అదరగొట్టిన దిగ్గజాలు..
ఆటో మోటార్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ దిగ్గజాలు నేడు ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ దిగ్గజం బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఆర్థికసంవత్సర సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా తన నికర లాభాలను 66 శాతం పెంచుకుని రూ.234 కోట్లగా నమోదుచేసింది. అగ్రికల్చర్, రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లోని తమ సహకారమే లాభాల బాటకు తోడ్పడిందని పేర్కొంది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, కరువు వంటివాటితో బాధపడుతున్న రైతులకు ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.159 కోట్ల నుంచి రూ.737 కోట్లకు పెంచుకోగలిగామని కంపెనీ తెలిపింది. జంప్ చేసిన ఐషర్ మోటార్స్ వాణిజ్య వాహనాల ఉత్పత్తి సంస్థ ఐషర్ మోటార్స్ లాభాల్లో జంప్ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 45.19శాతం ఎగిసి, రూ.413.16కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.284.56కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ సందర్భంగా కంపెనీ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ రూ.1,981.01కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది కంటే కంపెనీ 34.9 శాతం వృద్ధి నమోదుచేశామని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. నిర్వహణల నుంచి ఈ త్రైమాసికంలో అత్యధిక ఆదాయాల్లో ఆర్జించామని పేర్కొన్నారు. తమ టూవీలర్ విభాగం రాయల్ ఫీల్డ్ 30.8 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. నెస్లే రెండింతలు జంప్ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం నెస్లే ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభాలూ రెండింతలు జంప్ అయ్యాయి. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.269.39 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.124.20 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జించింది. నికర విక్రయాలు 35.13 శాతం ఎగిసి, రూ.2,346.18కోట్లగా రికార్డైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ లాంచ్ చేసిన 25 పైగా కొత్త ప్రొడక్ట్‌లతో లాభాల వృద్ధికి బాటలు వేశామని నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ్ తెలిపారు. మ్యాగీ ఉత్పత్తులతో మళ్లీ ఇన్స్టాంట్ న్యూడిల్స్ కేటగిరీలో పూర్తి ఆధిపత్య స్థానానికి వచ్చేశామని పేర్కొన్నారు. నష్టాల్లోంచి లాభాలోకి వచ్చిన ఐడీఎఫ్సీ దేశీయ లీడింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్సీ నష్టాల్లోంచి లాభాల్లోకి పయనించింది. శుక్రవారం వెలువరించిన ఫలితాల్లో కంపెనీ రూ.281.79 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాలను ఆర్జించినట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,468.83కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. గ్రూప్ మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో రూ.2,704.13 కోట్లగా ఉన్నట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. బజాజ్ ఆటో@7 శాతం ఇటు టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో సైతం రెండో క్వార్టర్లో 6.7 శాతం వృద్ధిని నమోదుచేసి రూ.1,122 కోట్ల లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. ఇతరాత్ర ఆదాయాలు లాభాలకు వెన్నుదన్నుగా నిలిచినట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఈ క్వార్టర్లో రెవెన్యూలు స్వల్పంగా 0.4 శాతం మాత్రమే పెరిగి రూ.6,432కోట్లగా నమోదయ్యాయి. నెమ్మదించిన సేల్స్ వాల్యుమ్ గ్రోత్తో రెవెన్యూలు స్వల్పంగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో 10.3 లక్షల యూనిట్ల విక్రయాలు జరుపగా.. గతేడాది కంపెనీ 10.56 లక్షల యూనిట్లను అమ్మింది. నైజీరియా, ఈజిప్ట్ వంటి ఎగుమతుల మార్కెట్లలో విక్రయాలు పడిపోయినట్టు బజాజ్ ఆటో తెలిపింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు రాయల్ గా
ముంబై: మోటార్ బైక్స్ దిగ్గజం ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల్లో భారీ పెరుగుదలను నమోదు చేసింది. జూలై నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 31 శాతం పెరిగాయి. సుమారు 53,378 యూనిట్లను సేల్ చేసింది. ఎగుమతులు కూడా 40 శాతం పెరిగి 1250 యూనిట్లకు చేరాయి. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ మేకర్ ఐషర్ మోటార్స్ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి. బీఎస్ఈలో 1 శాతం పెరిగి రూ. 22,661 వద్ద ట్రేడవుతోంది. 350 సీసీ ఇంజీన్ సెగ్మెంట్ లో 32 శాతం పెరిగి 5,727 యూనిట్లను విక్రయించింది. కాగా గతేడాది(2015) జూలైలో 40,760 వాహనాలను విక్రయించగా ఎగుమతులు 893 యూనిట్లు మాత్రమే. -
లాభాల్లో ఐషర్ మోటార్స్, దూసుకెళ్లిన షేర్లు
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఐషెర్ మోటార్స్ (ఈఎంఎల్) మెరుగైన ఫలితాలను నమోదు చేయడంతో మార్కెట్ లో షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బీఎస్ఈలో 6 శాతానికి పైగా లాభపడి రూ 22.382 వద్ద ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికం ఫలితాలు వెల్లడించడంతో శుక్రవారం నాటి మార్కెట్ లో షేరు ధర లైఫ్ టైమ్ హై ని తాకింది. ఐషర్ మోటార్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం 58.61 శాతం వృద్ధితో రూ.376 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.237 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.1,096 కోట్ల నుంచి రూ.1,556 కోట్లకు ఎగబాకింది. ఈ క్వార్టర్ లో మెరుగైన వృద్ధిని సాధించామని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్దార్థ్ లాల్ చెప్పారు. కంపెనీ పనితీరుపై వ్యాఖ్యానించిన ఆయన తమ తక్షణ వ్యాపారం పటిష్టంగా ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మిడ్-సైజ్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో విస్తరిస్తున్నామని తెలిపారు. -
ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీః రూ. 2.05 లక్షలు
పనాజి: ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్, కాంటినెంటల్ జీటీను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.2.05 లక్షలు(ఆన్‌రోడ్ ధర, ఢిల్లీ). రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ప్రస్తుతం బుల్లెట్, క్లాసిక్, థండర్బర్డ్ మోడల్ బైక్‌లను అమ్ముతోంది. 535 సీసీ ఇంజిన్ ఉన్న ఈ కాంటినెంటల్ జీటీ బైక్‌లను ఈ ఏడాది మొదట్లోనే అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది. పంజాబ్, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ బైక్‌ను రూ. 2 లక్షలలోపు విక్రయిస్తామని, ముంబైలో ఈ బైక్ ధర రూ. 2.14 లక్షలు(ఆన్ రోడ్ ధర, ముంబై)అని కంపెనీ పేర్కొంది.