
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో రెండు సరికొత్త బైక్‌లు విడుదలకానున్నా యి. ట్విన్ సిలిండర్లు కలిగిన ఈ బైక్‌లు త్వరలోనే భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోనూ లభ్యమవుతాయని కంపెనీ ప్రకటించింది. కాంటినెంటల్ జీటీ 650 పేరిట విడుదలకానున్న బైక్ ధర రూ.4,21,558 కాగా, ఇంటర్‌సెప్టర్ ఐఎన్‌టీ 650 పేరిట అందుబాటులోకి రానున్న మరో బైక్ ధర రూ.4,90,618 వద్ద నిర్ణయించి నట్లు సంస్థ సీఈఓ సిద్ధార్థ లాల్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తికానున్న ఈ రెండు బైక్‌లు భారత్ నుంచే అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతికాను న్నాయి. అమెరికా, లండన్, యూరప్ మార్కెట్లతో పాటుగానే ఇక్కడి మార్కెట్‌లో కూడా ఒకేసారి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి బైక్‌లను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు.