ఐషర్‌ మోటార్స్‌- 3ఎం ఇండియా.. క్యూ1 షాక్ | Eicher motors- 3M India tumbles on Q1 net loss | Sakshi
Sakshi News home page

ఐషర్‌ మోటార్స్‌- 3ఎం ఇండియా.. డీలా

Published Fri, Aug 14 2020 11:06 AM | Last Updated on Fri, Aug 14 2020 11:14 AM

Eicher motors- 3M India tumbles on Q1 net loss - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర  ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్‌ దిగ్గజం 3ఎం ఇండియా కౌంటర్‌ బలహీనపడింది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించడంతో ఆటో రంగ దిగ్గజం ఐషర్‌ మోటార్స్‌ కౌంటర్‌లో సైతం అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళ తప్పాయి. కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ల అమలు కారణంగా క్యూ1లో ఈ కంపెనీల పనితీరు మందగించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివరాలు చూద్దాం..

3ఎం ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో 3ఎం ఇండియా రూ. 40 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 85 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 748 కోట్ల నుంచి రూ. 327 కోట్లకు పడిపోయింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన సైతం రూ. 42.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3ఎం ఇండియా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం పతనమై రూ. 20,915 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 20,800 వరకూ తిరోగమించింది.

ఐషర్‌ మోటార్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో ఐషర్‌ మోటార్స్‌ రూ. 55 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 452 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2382 కోట్ల నుంచి రూ.  818 కోట్లకు భారీగా క్షీణించింది. ఇబిటా రూ. 614 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఐషర్‌ మోటార్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం పతనమై రూ. 20,810 వద్ద ట్రేడవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement