ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఐషెర్ మోటార్స్ (ఈఎంఎల్) మెరుగైన ఫలితాలను నమోదు చేయడంతో మార్కెట్ లో షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బీఎస్ఈలో 6 శాతానికి పైగా లాభపడి రూ 22.382 వద్ద ఉంది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికం ఫలితాలు వెల్లడించడంతో శుక్రవారం నాటి మార్కెట్ లో షేరు ధర లైఫ్ టైమ్ హై ని తాకింది. ఐషర్ మోటార్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం 58.61 శాతం వృద్ధితో రూ.376 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.237 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.1,096 కోట్ల నుంచి రూ.1,556 కోట్లకు ఎగబాకింది.
ఈ క్వార్టర్ లో మెరుగైన వృద్ధిని సాధించామని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్దార్థ్ లాల్ చెప్పారు. కంపెనీ పనితీరుపై వ్యాఖ్యానించిన ఆయన తమ తక్షణ వ్యాపారం పటిష్టంగా ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మిడ్-సైజ్ మోటార్సైకిల్ సెగ్మెంట్లో విస్తరిస్తున్నామని తెలిపారు.
లాభాల్లో ఐషర్ మోటార్స్, దూసుకెళ్లిన షేర్లు
Published Fri, Jul 29 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
Advertisement
Advertisement