
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.576 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.460 కోట్లతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని ఐషర్ మోటార్స్ తెలిపింది.
గత క్యూ1లో రూ.2,255 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 14% వృద్ధితో రూ.2,548 కోట్లకు పెరిగింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల అమ్మకాలు 22 శాతం వృద్ధితో 2.25 లక్షలకు చేరుకున్నాయి. ఈ బైక్‌ల ఎగుమతులు 10% పెరిగి 5,636కు చేరాయి. వీఈ కమర్షియల్ వెహికల్స్ బ్రాండ్ కింద విక్రయించే ట్రక్కులు, బస్సుల అమ్మకాలు 41 శాతం వృద్ధితో 16,327కు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐషర్ షేర్ ఫ్లాట్‌గా రూ.27,484 వద్ద ముగిసింద