
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెపుతూ లాభాల్లో ప్రారంభమైనాయి. ఆరంభంలో 90 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6శాతం కంటే తక్కువగా నమోదైన నేపథ్యంలో మార్కెట్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. ప్రస్తుతం ఉత్సాహంగా కొన సాగుతున్నాయి. నిఫ్టీ 26 పాయింట్లు లాభంతో 18523 వద్ద, సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 62255 వద్ద కొనసాగుతున్నాయి.
ఇండస్ ఇండ్, ఓఎన్జీసీ, హీరోమోటో, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్ లాభాల్లోనూ, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా నష్టాల్లోనూకొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 17పైసలు నష్టంతో 82.66 వద్ద ఉంది.
మరోవైపు సోమవారం ప్రకటించిన దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 11 నెలల కనిష్ట స్థాయి 5.88 శాతానికి దిగి వచ్చింది. డిసెంబర్ 2021 తర్వాత మొదటిసారిగా ఆర్‌బిఐ టార్గెట్ బ్యాండ్ 2-6 శాతానికి దిగువకు పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment