సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఆరంభ లాభాలనుంచి ఏ మాత్రం తగ్గని సూచీలు మరింత జోష్‌గా కొనసాగాయి. చివరికి సెన్సెక్స్1181 పాయింట్లు ఎగిసి 61795 వద్ద, నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో 18350 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ హైస్థాయి వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, రిలయన్స్ లాంటి హెవీ వెయిట్ షేర్లు మార్కెట్లను ఊతమిచ్చాయి. కోటక్ మహీంద్ర, జొమాటో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్ భారీగా లాభపడగా, ఐషర్‌మోటార్స్, హీరో మోటో, ఎం అండ్, బ్రిటానియా నష్టపోయాయి.
దలాల్ స్ట్రీట్ జోరు,ఐదు కారణాలు
బలపడుతున్న రూపాయి, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, అమెరికా ఇన్‌ఫ్లేషన్ , ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్లను తగ్గించనున్నారనే అంచచాలు దేశీయ ఈక్విటీలకు ఊతమిచ్చాయి. డాలరుతో పోలిస్తే రూపాయి బలపడుతున్న తీరు ఎఫ్‌ఐఐలను కొనుగోళ్ల వైపు మళ్లించింది. దీంతో గత 2-3 వారాలుగా నాన్‌స్టాప్ కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ జోరందుకుంది. నవంబర్‌లో ఇప్పటివరకు దలాల్ స్ట్రీట్‌లో ఎఫ్‌ఐఐలు రూ. 19,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని ఎన్‌ఎస్‌డిఎల్ డేటా చూపిస్తుంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు దేశీయంగా ప్రభావాన్ని చూపించాయి.
అంతర్జాతీయ సంకేతాలు
వాల్ స్ట్రీట్ సూచీలు దాదాపు రెండున్నరేళ్ల గరిష్టానికి చేరాయి. డౌ జోన్స్ 3.7శాతం, S&P 500 5.54 శాతం, నాస్డాక్ కాంపోజిట్ 7.35 శాతం ఎగిసాయి. ఇక ఆసియా మార్కెట్లలో MSCI ఇండెక్స్ 3.72 శాతం, జపాన్ నిక్కీ ఇండెక్స్ 2.75 శాతం పెరగడంతో రెండు నెలల గరిష్టాన్ని తాకింది.
యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా
అటు అక్టోబర్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 7.7 శాతానికి దిగి వచ్చింది. సెప్టెంబరులో ఇది 8.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఫెడరల్ రిజర్వ్ రేటుపెంపు ఉండకపోవచ్చనే అంచనాల మధ్య డాలర్ బలహీన పడింది. ఫలితంగా రూపాయి బాగా పుంజుకుంది. 1.05 పైసలు ఎగిసి 81 మార్క్‌ను కూడా బ్రేక్ చేసి 80.95పైకి ఎగబాకడం విశేషం. చివరికి 60పైసల లాభంతో 80.80 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment