
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 600 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 577 పాయింట్లు ఎగిసి 58988 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు ఎగిసి 17480 వద్ద కొనసాగుతున్నాయి. వరుసగా మూడో సెషన్ లాభాలతో సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను అధిగమించింది.
హిందాల్కో, భారతి ఎయిర్టెల్, ఎంఅండ్ ఎం, లార్సెన్ భారీగా లాభపడుతుండగా కోల్ ఇండియా, ఎన్టీపీసీ మాత్రమే నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 24 పైసలు లాభపడి 82.15 వద్ద ఉంది. బ్రిటన్ ఆర్థిక విధానంలో యూటర్న్‌తో సెంటిమెంట్ మెరుగుపడింది. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ బలపడి రిలీఫ్ ర్యాలీ ఊపందుకుంది. ఫలితంగా మంగళవారం ఆసియా స్టాక్‌లు పాజిటివ్‌గా ఉన్నాయి. అలాగే డాలర్‌లో వారం కనిష్టానికి చేరింది.