
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా పుంజుకుని లాభాలతోముగిసాయి. ఆరంభంలో 150 పాయింట్లు కోల్పోయింది. తరువాత ఒడిదుడుకులు కొనసాగాయి. ఒక దశలో 58వేల దిగువకు చేరిన సెన్సెక్స్ తరువాత లాభాల్లోకి మళ్లింది. చివరికి సెన్సెక్స్ 257 పాయింట్లు ఎగిసి 59031 వద్ద నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 17577 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఆటో,బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, ఫార్మ, ఆయిల్ రంగ షేర్లు లాభపడ్డాయి.
ఆటో రంగం టాప్ విన్నర్‌గా నిలిచింది. ఆరంభంలో భారీ నష్టాలు చవిచూసిన ఐటీ రంగం నష్టాల్లోనే ముగిసినా చివర్లో బాగా కోలుకోవడం విశేషం. ఎం అండ్‌ఎం, ఐషర్ మోటార్స్, బజాజ్‌ఫిన్స్‌సర్వ్, టైటన్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, దివీస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment