
సాక్షి, ముంబై: ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. వీక్లీ ఎఫ్ & ఓ గడువు ముగింపు, మిశ్రమ ప్రపంచ సంకేతాలు, బలమైన విదేశీ ప్రవాహాల మధ్య బిఎస్‌ఇ సెన్సెక్స్ 157 పాయింట్లు ఎగిసి 58222వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు లాభంతో 17331 వద్ద స్థిరపడ్డాయి.
ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, రిలయన్స్, ఇన్ఫోసిస్,యాక్సిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, స్టాక్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సీ, హెచ్‌యుఎల్, టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 45 పైసలు కోల్పోయి 81.88 వద్ద ముగిసింది.