
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో నష్టాలనుంచి కోలుకుని లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ , నిఫ్టీ మిడ్‌సెషన్ తరువాత కోలుకుని డే గరిష్టం వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు ఎగిసి 63,323 వద్ద, నిఫ్టీ 61పాయింట్ల లాభంతో 18,817 వద్ద స్థిరపడ్డాయి.
ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ లాభపడగా, హెల్త్‌కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, రిలయన్స్ షేర్ల లాభాలు సూచీల స్మార్ట్ రికవరీకి తోడ్పడ్డాయి.
టాటా మోటార్స్,హెచ్‌సీఎల్‌టెక్,పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, బజాజ్‌ఆటో టాప్ గెయినర్స్‌గా ఉండగా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్ నష్ట పోయాయి. అటు మిడ్‌క్యాప్‌ఇండెక్స్ వరుసగా ఏడో సెషన్‌లో కూడా రికార్డు హైని తాకింది.