
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. అయితే ఇంట్రా డేలో భారీ లాభాలతో మురిపించిన మార్కెట్లో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కనిపించింది. అయినప్పటికీ సెన్సెక్స్ 59వేల ఎగువన ముగిసింది. నిఫ్టీ 17500 మార్క్‌ను అధిగమించింది. వరుసగా మూడో సెషన్‌లోనూ లాభపడిన సెన్సెక్స్ చివరికి 147 పాయింట్ల లాభంతో 59107 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 17,512 వద్ద స్థిరపడ్డాయి.
మిశ్రమ ప్రపంచ సంకేతాలు, తగ్గుతున్న ముడి ధరలు విదేశీ పెట్టుబడుదారుల మద్దతు ఇన్వెస్టర్లసెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ , బ్యాంక్ షేర్లు లాభాల్లో, ఫార్మా మెటల్ నష్టపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ , నెస్లే, ఐటీసీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు పవర్ గ్రిడ్, సిప్లా, లార్సెన్ బజాజ్ ఆటో లా భపడ్డాయి. మరోవైపు ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్ కోల్ ఇండియా నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి మరోసారి ఢమాల్ అంది. ఏకంగా 80 పైసల నస్టంతో 83.02ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment