
సాక్షి, ముంబై: గురువారం మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి.సెన్సెక్స్ 1041 పాయింట్లు ఎగిసి 56857వద్ద,నిప్టీ 288పాయింట్ల లాభంతో 16929వద్ద పటిష్టంగా ముగిసాయి.ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్ల లాభాలు సూచీలను నడిపించాయి. ఫెడ్‌రిజర్వ్ వడ్డీ పంపుతో ఆరంభంలోనే భారీగా లాభపడినసంగతి తెలిసిందే.
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు లాభపడి 56498 వద్ద, నిప్టీ 180 పాయింట్లు లాభంతో 16822 వద్ద ట్రేడ్‌అవుతోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు 75 బేసిస్ పాయింట్లు పెంపుదల, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ , నిఫ్టీ ఐటీ ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.
బజాజ్‌మ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్ర, ఇండస్ ఇండ్, విప్రో భారీగాలాభపడుతుండగా, టాటా మోటార్స్, డా. రెడ్డీస్, భారతి ఎయిర్టెల్, సన్‌ఫార్మ, సిప్లా నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, స్పైస్ జెట్ నష్టపోతున్నాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి 16 పాయింట్లు ఎగిసి 79.77 వద్ద కొనసాగుతోంది.