
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. కానీ వెంటనే ఫ్లాట్‌గా మారిపో యాయి. సెన్సెక్స్ 122 పాయింట్లు ఎగిసి 60956 వద్ద నిఫ్టీ 45 పాయింట్లు లాభంతో 18104 వద్దకు చేరడంతో నిఫ్టీ తిరిగి 18వేల100 ఎగువకు, సెన్సెక్స్ 60 వేలకు ఎగువకు చేరింది. కానీ వెంటనే ఆరంభ లాభాలను కోల్పోయి ప్రస్తుతం ఫ్లాట్‌గా కొనసాగుతోంది. లాభ నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట కనిపిస్తోంది.
బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ఉండగా, ఫార్మా, ఐటీ రంగ షేర్లు నష్టపోతున్నాయి. హిందాల్కో, బజాజ్ ఆటో,యాక్సిస్ బ్యాంకు,బ్రిటానియా, ఎస్‌బీఐ, టైటన్, లాభాల్లోనూ, ఫలితాల నేపథ్యంలో హీరోమోటో కార్ప్‌కూడా టాప్ లూజర్‌గా ఉంది. ఇంకా. ఇన్ఫోసిస్, దివీస్, అపోలో హాస్పిటల్స్, డా.రెడ్డీస్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment