
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీలాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 303 పాయింట్లు ఎగిసి 59506 వద్ద కొనసాగుతుండగా,నిఫ్టీ 82 పాయింట్లు లాభంతో17645వద్ద ట్రేడ్ అవుతోంది. ఫలితంగా వరుసగా ఆరో రోజు శుక్రవారం కూడా లాభాల పరంపర కొసాగుతోంది. గ్లోబల్ అమ్మకాలు వెల్లువెత్తుతున్నన్పటికీ దేశీయ సూచీలు లాభాల దౌడు దీస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఆదాయ ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి.
యాక్సిస్ బ్యాంకు, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, తదితర షేర్లు భారీగా లాభపడుతుండగా, దివీస్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, టెక్ ఎం నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలోరూపాయి స్వల్పనష్టంతో 82.81 వద్ద ఉంది. మరోవైపు బ్రిటీష్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ ఆరు వారాల పదవికి రాజీనామాతో కరెన్సీ మార్కెట్‌లో యూకే స్టెర్లింగ్ పతనాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment