
సాక్షి,ముంబై: చమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 61757 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు ఎగిసి 18341 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుధవారం రూ.790 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.414 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
టాటా కన్జ్యూమర్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ లాభాల్లోనూ, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్, హీరో మోటో కార్ప్, టాటా మోటార్స్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 17 పైసలు ఎగిసి 81.70 వద్ద ఉంది.