
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసినప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు లాభాలతో కీలక మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ చెప్పాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 62,547 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 18,534 వద్ద స్థిరపడింది.
హిందాల్కో, హీరో మోటో కార్ప్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ విన్నర్స్‌గా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్,హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టీసీఎస్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 12పైసలు ఎగిసి 82.30 వద్ద ముగిసింది.