
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గి ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరికి పాజిటివ్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 212 పాయింట్లు ఎగిసి 59757వద్ద,నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 17737 వద్ద స్థిరపడ్డాయి. ఎఫ్ అండ్ వో సిరీస్ ముగింపు కావడంతో లాభాల స్వీకరణ కనిపించింది.
దాదాపు అన్ని రంగాలు ముఖ్యంగా మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా స్టీల్ , రిలయన్స్ లాభపడగా, బజాజ్‌ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, నెస్లే, టెక్ మహీంద్ర నష్టపోయాయి. మారుతిక్యూ2 ఫలితాలను రేపు(శుక్రవారం) ప్రకటించనుంది.