
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ఆరంభమైనాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా పెరిగి వరుసగా రెండో రోజు బుధవారం కూడా లాభాలను పొడిగించింది. నవంబరు ద్రవ్యోల్బణం దిగి రావడంతో పాటు, ఆసియా, అమెరికా మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా సెన్సెక్స్ 197 పాయింట్లు లాభంతో 62731 వద్ద, 60 పాయింట్లుఎగిసిన నిఫ్టీ 18677 వద్ద కొన సాగు తున్నాయి.
ఫలితంగా నిఫ్టీ 18600 ఎగువన కొనసాగుతోంది. హిందాల్కో, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్ర టాప్ విన్నర్స్‌గా ఉండగా, భారతి ఎయిర్టెల్, నెస్లే, ఎం అండ్, హెచ్‌యూఎల్, మారుతి సుజుకి నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 20 పైసలు ఎగిసి 82.64 వద్దకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment