
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోనేముగిసాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ సెన్సెక్స్ 59300 స్థాయికి పైన ముగియడం గమనార్హం. ముఖ్యంగా అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ సంవత్ 2078 చివరి రోజున కీలక సూచీలు సానుకూలంగా ముగిసాయి. వరుసగా ఆరో రోజు లాభాల నేపథ్యంలో వారాంతంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ కేవలం 104 పాయింట్ల లాభాలకు పరిమితమై 59307వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17576 వద్ద స్థిరపడింది. ఐటీ, మీడియా రంగ షేర్లు మినహా బ్యాంక్ ,కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇతర రంగాల షేర్లు లాభపడ్డాయి.
క్యూ2 ఫలితాల జోష్‌తో యాక్సిస్ బ్యాంకు ఏకంగా 9 శాతం లాభపడగా, ఫలితాలపై అంచనాలను రిలయన్స్ షేరు నష్టపోయింది. .ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు,కోట్ మహీంద్ర, హెచ్‌యూఎల్‌తదితరాలు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్‌ఫిన్ సర్వ్, దివీస్ , అదానీ పోర్ట్స్, యూపీఎల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రరూపాయి 82. 67 వద్ద ముగిసింది.