
సాక్షి, ముంబై: ఆరంభంలో నష్టాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో, పటిష్ట స్థాయిలకు ఎగువన ముగిసాయి. సెన్సెక్స్ 96 పాయింట్లు ఎగిసి 59202 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభంతో 17563 వద్ద పటిష్టంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలనుంచి తెప్పరిల్లాయి. యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్ భారీగా లాభపడ్డాయి. మరో వైపు ఇండస్ ఇండ్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, హెడ్‌సీఎఫ్‌సీ బ్యాంకు నష్టపోయాయి. అటు డాలరు మారకంలో గురువారం ఉదయం రికార్డు పతనాన్ని నమోదు చేసిన రూపాయి భారీగా పుంజుకుంది. 31 పైసలు ఎగిసి 82.76 స్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment