
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లో చివర్లో లాభాల స్వీకరణ కనిపించింది. చివరికి వారాంతంలోసెన్సెక్స్ 685 పాయింట్లు ఎగిసి 57919 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు లాభంతో 17186 వద్ద ముగిసింది.
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్ తదితరాలు లాభపడగా, ఓఎన్జీజీసీ, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.35 వద్ద ముగిసింది.