
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు రోజంతా లాభాలతో కళకళలాడాయి. కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన పటిష్టంగా ముగిసాయి. సెన్సెక్స్ 379 పాయింట్లు ఎగిసి 59842 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 17825 వద్ద స్థిరపడ్డాయి.
మీడియా, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మిగతావన్నీ లాభాల్లోనే ముగిసాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, మారుతి టాప్ గెయినర్స్‌గా ఉండగా, గ్రాసిం, ఓఎన్జీసీ, హిందాల్కో, భారతి ఎయిర్ టెల్, సన్ ఫార్మ నష్టాల్లో ముగిసాయి.