ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం లాభాలు అందుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థూల ఆర్ధిక గణాంకాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల తీరు తెన్నులు సూచీలకు దారి చూపొచ్చంటున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు అంచనా వేశారు.
‘‘దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రధాన వార్తలేవీ లేనందును ప్రపంచ పరిణామాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. చైనా రియల్ ఎస్టేట్ సమస్యలు, డాలర్ ఇండెక్స్ హెచ్చు తగ్గులు, బాండ్లపై రాబడులు, యూఎస్ నిరుద్యోగ డేటా అంశాలు ఈక్విటీ మార్కెట్ల దిశానిర్దేశాన్ని మార్చగలవు. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 19,200 వద్ద తక్షణ మద్దతు, ఎగువ స్థాయిలో 19,600 వద్ద కీలక నిరోధం కలిగి ఉందని ఆప్షన్స్ డేటా సూచిస్తోంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు.
స్థూల ఆర్ధిక గణాంకాలు మెప్పించడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసిరావడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు లాభపడ్డాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, రియల్ ఎస్టేట్‌తో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు చైనా ఉద్దీపన చర్యలు చేపట్టడంతో గత వారం ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో లాభాల్లో కదలాడాయి.
స్థూల ఆర్ధిక డేటాపై దృష్టి
దేశీయంగా ఆగస్టు సేవల రంగ పీఎంఐ డేటా మంగళవారం విడుదల అవుతుంది. అదే రోజు జూలై అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఆగస్టు వాహన అమ్మకాలు వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు బుధవారం యూఎస్ జూలై వాణిజ్య లోటు, యూరో జోన్ రిటైల్ అమ్మకాలు.., గురువారం అమెరికా నిరుద్యోగ గణాంకాలు, చైనా వాణిజ్య లోటు డేటా విడుదల అవుతుంది. శుక్రవారం యూఎస్ హోల్‌సేల్ ఇన్వెంటరీ, జపాన్ క్యూ2 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా డేటా వెల్లడి అవుతుంది. అదే రోజున దేశీయంగా ఆగస్టు 25వ తేదీతో ముగిసిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ వృద్ది డేటా, సెపె్టంబర్ ఒకటో తేదితో ముగిసిన ఫారెక్స్ నిల్వలు డేటా విడుదల అవుతుంది.
ఈ వారంలో రెండు ఐపీఓలు
రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీఓ సెపె్టంబర్ 4న మొదలై ఆరో తేదిన ముగిస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.165.03 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూ ధరను రూ. 93–రూ. 98గా నిర్ణయించారు. షేర్లు ఈ నెల 14న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ పబ్లిక్ ఇష్యూ సెపె్టంబర్ 6న మొదలై ఎనిమిదో తేదీ ముగుస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 869.08 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ధరల శ్రేణి రూ.695– రూ. 735 గా ఉంది. షేర్లు ఈ నెల 14న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి.
నాలుగు నెలల కనిష్టానికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు
భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు ఆగస్టులో స్వల్పంగా తగ్గాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు, క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి పరిణామాలతో ఆగస్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.12 వేల కోట్లకు తగ్గించారు. అంతకు ముందు వరుసగా మూడు నెలల పాటు ఎఫ్‌పీఐలు రూ.40 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ‘‘పూర్తిగా నిధుల ఉససంహరణ కంటే వేచి ఉండే ధోరణిని అనుసరిస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ప్రభావం ఉంటుంది’’ అని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్ రంగాల్లో ఎక్కువగా షేర్లు కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment