
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి నష్టాలనుంచి బౌన్స్ బ్యాక్ అయిన సూచీలు కీలక మద్దతు స్తాయిలను అధిగమించాయి. ఐటీ తప్ప అన్ని రంగాలు, ముఖ్యంగా మెటల్, ఫార్మా, బ్యాంకు షేర్లు లాభపడుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 270 పాయింట్లు తిరిగి 63 వేల మార్క్ పైకి ఎగిసింది. నిఫ్టీ 18,750 పైన బలంగా ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్‌ఫిన్‌సర్వ్, డా. రె డ్డీస్, హిందాల్కో యూపీఎల్ తదితర షేర్లు లాభాల్లోనూ, బజాజ్‌ఆటో, టాటా కన్జ్యూమర్, విప్రో, టీసీఎస్ బీపీసీఎల్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment