
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రీబౌండ్ అయ్యాయి. ఆరంభంలో రెండు వందలకుపైగా నష్టపోయిన సెన్సక్స్ వెంటనే లాభాల్లోకి మళ్లింది. ప్రధానంగా బ్యాంకింగ్, టెల్కో షేర్ల లాభాలతో వరుసగా రెండో సెషన్లో సూచీలు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 246 పాయింట్లు ఎగిసి 54767 వద్ద,నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 16340 వద్ద స్థిరపడ్డాయి.
అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో గ్యాస్ సెక్టార్‌పై కూడా విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న అంచనాల మధ్య అయిల్ అండ్ గ్యాస్ షేర్లు భారీగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టాటా, హీరో మోటో కార్ప్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 80 స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. ఇంట్రాడేలో 80.06 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకిన రూపాయి చివరికి 79.94 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment